Saturday, September 1, 2018
బాహుబలి 3 నవ్వులే నవ్వులు
ప్రభాస్ బాహుబలి గా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే అయితే తాజాగా సోషల్ మీడియాలో బాహుబలి 3 నవ్వుల వర్షం కురిపిస్తోంది . బాహుబలి , బాహుబలి 2 అందరికీ తెలుసు మరి ఈ బాహుబలి 3 ఏంటి అని అనుకుంటున్నారా ? అసలు ఈ బాహుబలి 3 కి సినిమాలకు సంబంధం లేదు రాజకీయ నేపథ్యం ఉన్న బుల్లితెర సినిమా ….. యు ట్యూబ్ సినిమా అన్నమాట . మధ్యప్రదేశ్ లో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి అక్కడ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం అధికారంలో ఉంది .
ఇక కాంగ్రెస్ పార్టీ అక్కడ ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావాలని జ్యోతిరాదిత్య సింథియా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు .శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం పై వ్యతిరేకత కూడా ఉంది దాంతో పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాడు . ఇంకేముంది భారతీయ జనతా పార్టీ కి చెందిన ఓ కార్యకర్త బాహుబలి చిత్రంలోని సన్నివేశాలకు జ్యోతిరాదిత్య సింథియా ఫోటో ని తగిలించాడు . అలాగే బాహుబలి గా శివరాజ్ సింగ్ చౌహన్ ని పోల్చుతూ రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది .
English Title: baahubali 3 shivraj singh chouhan video goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2LKImfo

No comments :
Post a Comment