Search This Blog

Powered by Blogger.

Blog Archive

Showing posts with label టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews. Show all posts

Thursday, January 10, 2019

ఎన్టీఆర్ కథానాయకుడు పై దుష్ప్రచారం

No comments :
 Propaganda on NTR kathanayakudu నిన్న విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు నందమూరి వ్యతిరేక అభిమానులు . ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం బాగోలేదని , బాలయ్య వేసిన గెటప్ లపై రకరకాల ఘోరమైన కామెంట్స్ పెడుతూ పండగ చేసుకుంటున్నారు . కేవలం కామెంట్స్ మాత్రమే కాదు రకరకాల సినిమా క్లిప్ లపై వీళ్లకు ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెడుతూ బాలయ్య ఇమేజ్ ని దారుణంగా దెబ్బ కొడుతున్నారు .
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కథానాయకుడు పై సాగుతున్న దుష్ప్రచారం మాములుగా లేదు . ఓ రేంజ్ లో బాలయ్య ని ఆడుకుంటున్నారు బాలయ్య వ్యతిరేకులు . నిజంగానే బయోపిక్ లో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ వాటిని మరీ పెద్దవి చేసి సంతోష పడుతున్నారు . నెగెటివ్ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుండటంతో పాపం కలెక్షన్లు ఈరోజు బాగానే పడిపోయాయి .

English Title:  Propaganda on NTR kathanayakudu

 

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2sk5rhP

కత్తులతో పొడుచుకున్న అభిమానులు

No comments :

War between Rajinikanth fans and ajith fansఅభిమానం వెర్రితలలు వేస్తే పర్యావసానం ఎలా ఉంటుందో తాజాగా తమిళనాడులోని వేలూరు లో జరిగిన సంఘటనే ఉదాహరణ . ఈరోజు రజనీకాంత్ , అజిత్ ల సినిమాలు విడుదల అవుతుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ ల వద్ద గుమికూడి హడావుడి చేశారు . రజనీకాంత్ నటించిన పేట , అజిత్ నటించిన విశ్వాసం చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది . అయితే మా హీరో నటించిన చిత్రం బ్లాక్ బస్టర్ అంటే లేదు లేదు మా హీరో నటించిన చిత్రమే బ్లాక్ బస్టర్ అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ అజిత్ ఫ్యాన్స్ వాదనకు దిగారు .

ఇంకేముంది వాదన కాస్త శృతిమించి గొడవకు దారితీసింది , దాంతో రజనీకాంత్ అభిమానులు అలాగే అజిత్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు . కొట్టుకోవడమే కాకుండా ఏకంగా కత్తులతో పొడుచుకున్నారు . దాంతో నలుగురు అభిమానుల పరిస్థితి విషమంగా ఉంది అలాగే పదుల సంఖ్యలో గాయపడ్డారు . ప్రస్తుతం అందరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే అందులో నలుగురి పరిస్థితి 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేం అంటున్నారు డాక్టర్లు . అభిమానం ఉండటంలో తప్పులేదు కానీ ఇలా కొట్టుకోవడం , కత్తులతో పొడుచుకోవడం మాత్రం నిజంగా దురభిమానమే !

English Title: War between Rajinikanth fans and ajith fans



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2M521bR

రజనీకాంత్ పేట ఆన్ లైన్ లో లీక్

No comments :

 Tamil Rockers leaks Rajinikanth's Pettaసూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రం ఈరోజు విడుదల అయిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా మొత్తం ఆన్ లైన్ లో లీక్ చేసి సంచలనం సృష్టించారు తమిళ రాకర్స్ . గతకొంత కాలంగా తమిళ రాకర్స్ ప్రతీ పెద్ద సినిమాని పైరసి చేస్తూ దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు . తమిళనాడు పోలీసులు , ఇతర అధికారులు అలాగే చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు ఎంతగా పైరసీ ని అరికట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నా తమిళ రాకర్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు .

అంతేకాదు పక్కాగా హెచ్ డి క్వాలిటీ ని ఆన్ లైన్ లో పెట్టేస్తున్నారు , దర్శక నిర్మాతలకు , హీరోలకు సవాల్ విసురుతూనే ఉన్నారు . తాజాగా రజనీకాంత్ నటించిన పేట చిత్రాన్ని కూడా పైరసీ చేసి పడేసారు తమిళ రాకర్స్ . పైరసీ చేయడం వల్ల నిర్మాతలకు తీవ్ర నష్టం జరుగుతోంది కానీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీ ని ఆపలేకపోతున్నారు .

English Title:  Tamil Rockers leaks Rajinikanth’s  Petta



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2SOpxfG

అభిమానిలాగానే ఫీలై సినిమా చేస్తా – బోయ‌పాటి శ్రీను

No comments :

Director Boyapati Srinu Press Interactionమెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌, కియరా అద్వాని హీరో హీరోయిన్‌గా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వినయవిధేయరామ‘. డి.వి.వి.దానయ్య నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికి జనవరి 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ …

– వినయం విధేయత ఉంది కాబట్టే రాముడయ్యాడు. ఈ రాముడు ఫ్యామిలీ పట్ల విధేయుడు. ఆ విధేయత ఏ స్థాయిలో ఉంటుందనేది మీరు సినిమా లో చూస్తారు.

– ఈ సినిమా ట్రైలర్ లో రామ్ చరణ్ కటౌట్ చూస్తుంటే ఐరన్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు. ఆ బాడీలో ఈ రోజు ఉన్న మెచ్యూరిటీ నాలుగేళ్ల క్రితం లేదు. అందుకే పర్ఫెక్షన్ కోసం టైమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి ఇదే కరెక్ట్ టైమ్.

– నేను చేసిన సినిమాలు ‘భద్ర’ నుండి బిగిన్ అయితే ‘వినయ విధేయ రామ’ వరకు ఫ్యామిలీ ఇమోషన్స్ కే ఫస్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఆ తరవాతే సొసైటీ గురించి.. కథలో ఇంకా స్కోప్ ఉందనుకుంటే తక్కిన విషయాల గురించి ఆలోచిస్తా.

– అజర్ బైజాన్ సీక్వెన్స్ ప్రిపేర్ చేసుకుని రామ్ చరణ్ కి చెప్పినపప్పుడు, అప్పటికే 2 నెలల కన్నా ఎక్కువ టైమ్ లేదు. ఇప్పట్లో కష్టం అని నాకు తెలిసినా, మీరు చేసేస్తారు అని ఒక మాట అనేసి వెళ్ళిపోయా. ఆయన కూడా ఆ మాటని అలాగే తీసుకుని, నన్ను నమ్మాడు కాబట్టే అంతలా కష్టపడ్డాడు.

– ‘వినయ విధేయ రామ’ విజన్ నుండి విజువల్ వరకు ఉన్న మెయిన్ కనెక్టివిటీ రామ్ చరణ్.. ఆయన లేకపోతే ఇది సాధ్యపడేది కాదు.

– సినిమా అంటే పండుగ‌. పండుగ‌ని అభిమానుల వరకు చేర్చాలంటే ఆర్టిస్ట్ నన్ను నమ్మాలి. వాళ్ళు నన్ను నమ్మాలంటే వాళ్ళకన్నా ముందు నేను పదింతలు ఎక్సర్ సైజు చేసి, వాళ్ళను ఇన్స్ పైర్ చేయగలగాలి. ఈ ప్రాసెస్ లో ఆర్టిస్టుల కన్నా కథలో నేనే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాను. కథ చెప్పేటప్పుడే ఎఫెక్ట్స్ తో సహా ఎక్స్ ప్లేన్ చేస్తాను.
– మాస్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో ఒక కొత్త పాయింట్‌ని `విన‌య విధేయ రామ‌`లో రైజ్ చేశాం. అది ఆడియెన్స్‌కి రీచ్ అవుతుంది.

– సినిమాలో క్యారెక్టర్స్ కూడా ఎవరు అందుబాటులో ఉన్నారో వారిని తీసుకోవడం జరగలేదు. ఒక I.A.S. ఆఫీసర్, హీరోకి పెద్దన్నయ్య అన్నప్పుడు… ఎవరిని తీసుకున్నా ఈ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సింక్ అవ్వాలి. అందుకే ప్రశాంత్. అలా వరసగా ఏజ్ దగ్గరి నుండి పర్ఫామెన్స్ లెవెల్స్ వరకు ప్రతీది క్షుణ్ణంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవడం జరిగింది.

– వివేక్ ఒబెరాయ్‌గారినిని కలిసినపుడు ఆయన అన్న మొదటి మాట ‘నేను చేయను’. నేను ‘రక్త చరిత్ర’ సినిమా చేశాను. మళ్ళీ అదే స్థాయి సినిమా అయితే తప్ప ..నేను ఆలోచించనండి అని చెప్పాడు. సరే సర్.. మీరు చేయకండి కానీ, ఒకసారి క్యారెక్టర్ వినండి అని చెప్పాను. అంతే విన్నాడో లేదో.. డేట్స్ ఇచ్చేశాడు. అదే కమిట్ మెంట్ తో వచ్చాడు, చేసేశాడు.. వెళ్ళిపోయాడు.
– నా దృష్టిలో సినిమా అంటే కలర్ ఫుల్ గా ఉండాలి. అందుకే ఎక్కువగా అర్బన్ బ్యాక్ డ్రాప్ లో కథల్ని ఎంచుకుంటాను. అందుకే ప్రతి సినిమాలో రిచ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ అన్పిస్తుందేమో..
– ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ దే ప్రధాన పాత్ర. జ్యూస్ నాదైనా మంచి గ్లాస్ ఉండాలి. అందుకే రామ్ చరణ్, నాకు D.V.V. గారైతేనే బెటర్ అని చెప్పడం జరిగింది. సినిమా ఈ రోజు ఇంత అద్భుతంగా వచ్చిందంటే అది ఆయన వల్లే పాసిబుల్ అయింది.

– నాకు రామ్ చరణ్ లో ఎక్కువగా నచ్చింది ఒకటే. ఆయనకీ అసలు తృప్తి ఉండదు. ఎంత సాధించినా ఇంకా ఏదో చేయాలి అనుకుంటూ ఉండడు. సినిమా సినిమాకి ఎదుగుతూనే ఉంటాడు… ఇంకా ఆశగా చూస్తూనే ఉంటాడు.
– నేను చిన్న సినిమాలు చేయలేను. నా నుండి ఆడియెన్స్ ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో అది 100% ఇవ్వాలి అనే నేననుకుంటా. అవతల ఎక్స్ పెక్టేషన్స్ ఒకలా ఉండి, మ‌న ప్రొడ‌క్ట్ ఇంకోలా ఉంటే మ్యాచ్ అవ్వదు.. అందుకే నేను చిన్న సినిమాలు చేయను. ఒకవేళ నేను బయోపిక్ చేసినా, అందులో కూడా దమ్ము కంపల్సరీ గా ఉంటుంది.
– ఏ హీరోతో సినిమా చేసినా, ఆ హీరోకి అభిమానినై చేస్తా. చరణ్ కోసం సినిమా రాసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ సీట్లోకూర్చుని చూస్తున్నట్టుగా ఫీలై కథ రాసుకున్నా. ప్రతి హీరోకి అదే చేస్తా. ఇది కూడా అలాంటి సినిమానే.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2H6a8Ga

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం

No comments :

keerthy suresh new movie openingఅల‌నాటి మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించి అంద‌రితో శ‌భాష్ అనిపించుకున్న హీరోయిన్ కీర్తిసురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం గురువారం హైదారాబాద్ అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో ప్రారంభ‌మైంది. న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ క్లాప్ కొట్ట‌గా.. డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ సినిమాను కెమెరా స్విచ్చాన్ చేశార‌. దేవుడి ప‌టాల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి డైరెక్ట‌ర్ ఎస్‌.హ‌రీష్ శంక‌ర్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్క్రిప్ట్‌ను ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు, పరుచూరి గోపాల‌కృష్ణ‌, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, స్ర‌వంతి రవికిషోర్ డైరెక్ట‌ర్‌కి అందించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

కీర్తి సురేష్ మాట్లాడుతూ – “తెలుగులో `మ‌హాన‌టి` త‌ర్వాత న‌టిస్తోన్న సినిమా. మ‌హిళా ప్ర‌ధాన‌మైన చిత్రంలో న‌టించ‌డం చాలా హ్యాపీగా ఉంది. ప్ర‌తి అమ్మాయికి క‌నెక్ట్ అయ్యే సినిమా. ఎక్కువ భాగం సినిమా యు.ఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంది. డైరెక్ట‌ర్ న‌రేంద్ర మంచి క‌థ‌ను సిద్ధం చేశారు. త‌ప్ప‌కుండా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతాన‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు నరేంద్ర మాట్లాడుతూ – “2016 నుండి ఈ క‌థ‌పై వ‌ర్క్ చేస్తున్నాను. త‌రుణ్ నాకు స్క్రిప్ట్‌లో హెల్ప్ చేశాడు. అన్నీ ఎమోష‌న్స్ క‌ల‌గ‌లిపిన క‌థ ఇది. ఈ క‌థ‌కు కీర్తిసురేష్‌గారు త‌ప్ప మ‌రేవ‌రూ సూట్ కారు. 25 శాతం ఇండియాలో… 75 శాతం యు.ఎస్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగ‌నుంది. ఏప్రిల్ లో యు.ఎస్‌.షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. . కుటుంబ క‌థా ప్రేక్ష‌కులు స‌హా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. ఫిబ్ర‌వ‌రిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది“ అన్నారు.

నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ – “`మ‌హాన‌టి` చిత్రంతో కీర్తిసురేష్ తెలుగువారి హృద‌యాల్లో ఎంత‌టి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. అలాంటి చిత్రం త‌ర్వాత మా బ్యాన‌ర్‌లో ఆమె సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. మ‌హిళా ప్ర‌ధాన‌మైన చిత్రం. ప్ర‌తి అమ్మాయి త‌న జీవితంలో త‌మ జీవితంలో ఎక్క‌డో ఒక‌చోట ఇలాంటి సిచ్యువేష‌న్‌ను ఎదుర్కొనే ఉంటుంది. మ‌హిళ‌ల‌కు క‌నెక్ట్ అవుతుంది. సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌ల్యాణ్ కోడూరి మాట్లాఉతూ – “మ‌హేష్ కోనేరు నిర్మాత‌గా చేస్తోన్న మూడో సినిమా ఇది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించే సంగీతం అందిస్తాను. కీర్తిసురేష్‌తో వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది“ అన్నారు.



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CaGREO