Thursday, January 10, 2019
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కొత్త చిత్రం ప్రారంభం

కీర్తి సురేష్ మాట్లాడుతూ – “తెలుగులో `మహానటి` తర్వాత నటిస్తోన్న సినిమా. మహిళా ప్రధానమైన చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యే సినిమా. ఎక్కువ భాగం సినిమా యు.ఎస్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. డైరెక్టర్ నరేంద్ర మంచి కథను సిద్ధం చేశారు. తప్పకుండా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతాననే నమ్మకం ఉంది“ అన్నారు.
దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ – “2016 నుండి ఈ కథపై వర్క్ చేస్తున్నాను. తరుణ్ నాకు స్క్రిప్ట్‌లో హెల్ప్ చేశాడు. అన్నీ ఎమోషన్స్ కలగలిపిన కథ ఇది. ఈ కథకు కీర్తిసురేష్‌గారు తప్ప మరేవరూ సూట్ కారు. 25 శాతం ఇండియాలో… 75 శాతం యు.ఎస్‌లో చిత్రీకరణ జరుగనుంది. ఏప్రిల్ లో యు.ఎస్.షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. . కుటుంబ కథా ప్రేక్షకులు సహా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది“ అన్నారు.
నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ – “`మహానటి` చిత్రంతో కీర్తిసురేష్ తెలుగువారి హృదయాల్లో ఎంతటి స్థానం సంపాదించుకుందో తెలిసిందే. అలాంటి చిత్రం తర్వాత మా బ్యానర్‌లో ఆమె సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మహిళా ప్రధానమైన చిత్రం. ప్రతి అమ్మాయి తన జీవితంలో తమ జీవితంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి సిచ్యువేషన్‌ను ఎదుర్కొనే ఉంటుంది. మహిళలకు కనెక్ట్ అవుతుంది. సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణ్ కోడూరి మాట్లాఉతూ – “మహేష్ కోనేరు నిర్మాతగా చేస్తోన్న మూడో సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే సంగీతం అందిస్తాను. కీర్తిసురేష్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది“ అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2CaGREO

Subscribe to TOLLYWOOD
No comments :
Post a Comment