Search This Blog

Powered by Blogger.

Blog Archive

Thursday, January 10, 2019

కత్తులతో పొడుచుకున్న అభిమానులు

No comments :

War between Rajinikanth fans and ajith fansఅభిమానం వెర్రితలలు వేస్తే పర్యావసానం ఎలా ఉంటుందో తాజాగా తమిళనాడులోని వేలూరు లో జరిగిన సంఘటనే ఉదాహరణ . ఈరోజు రజనీకాంత్ , అజిత్ ల సినిమాలు విడుదల అవుతుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ ల వద్ద గుమికూడి హడావుడి చేశారు . రజనీకాంత్ నటించిన పేట , అజిత్ నటించిన విశ్వాసం చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది . అయితే మా హీరో నటించిన చిత్రం బ్లాక్ బస్టర్ అంటే లేదు లేదు మా హీరో నటించిన చిత్రమే బ్లాక్ బస్టర్ అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ అజిత్ ఫ్యాన్స్ వాదనకు దిగారు .

ఇంకేముంది వాదన కాస్త శృతిమించి గొడవకు దారితీసింది , దాంతో రజనీకాంత్ అభిమానులు అలాగే అజిత్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు . కొట్టుకోవడమే కాకుండా ఏకంగా కత్తులతో పొడుచుకున్నారు . దాంతో నలుగురు అభిమానుల పరిస్థితి విషమంగా ఉంది అలాగే పదుల సంఖ్యలో గాయపడ్డారు . ప్రస్తుతం అందరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . అయితే అందులో నలుగురి పరిస్థితి 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేం అంటున్నారు డాక్టర్లు . అభిమానం ఉండటంలో తప్పులేదు కానీ ఇలా కొట్టుకోవడం , కత్తులతో పొడుచుకోవడం మాత్రం నిజంగా దురభిమానమే !

English Title: War between Rajinikanth fans and ajith fans



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2M521bR

No comments :

Post a Comment