Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, September 30, 2018

మనికర్ణిక టీజర్ రెడీ మరి క్రిష్ పేరు ఉంటుందా

No comments :

Manikarnika trailer out on October 2ndవీరనారి ఝాన్సీ రాణి బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం మనికర్ణిక. వివాదాస్పద భామ కంగనా రనౌత్ ఝాన్సీ పాత్రలో నటించిన ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించాడు. దాదాపు 80 శాతానికి పైగా క్రిష్ డైరెక్షన్ లోనే తెరకెక్కింది మనికర్ణిక అయితే క్రిష్ కు కంగనా రనౌత్ కు షూటింగ్ లో మనస్పర్థలు రావడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడు క్రిష్ . దాంతో బ్యాలెన్స్ ఉన్న టాకీ పార్ట్ కు కంగనా దర్శకత్వం వహించింది. ఇంకేముంది పెద్ద రచ్చ అయ్యింది ఈ విషయం . కట్ చేస్తే ఈ సినిమాకు డైరెక్టర్ నేను కాదు క్రిష్ మాత్రమే అని కవరింగ్ ఇచ్చింది కంగనా . ఇక ఇప్పుడేమో గాంధీ జయంతి ని పురస్కరించుకుని అక్టోబర్2న ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ట్రైలర్ రిలీజ్ అంటే తప్పకుండా దర్శకుడి పేరు ఉండాలి టైటిల్స్ లో . మరి రేపు సాయంత్రం విడుదల అయ్యే ట్రైలర్ లో క్రిష్ పేరు ఉంటుందా ? కంగనా పేరు ఉంటుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. కంగనా రనౌత్ క్రిష్ ని అవమానించడం వల్ల ఆమెతో గొడవపడి ప్రయోజనం లేదని మనికర్ణిక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు , అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ లభించడంతో సంతోషంగా ఒప్పుకున్నాడట . ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. అయితే బాలీవుడ్ లో చేస్తున్న మనికర్ణిక క్రిష్ కు సవాల్ లాంటిదే. మరి టైటిల్స్ లో క్రిష్ పేరు ఉంటుందా ? చూడాలి.

English Title: Manikarnika trailer out on October 2nd



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2NTLefU

No comments :

Post a Comment