Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, September 30, 2018

టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన బాబుమోహన్

No comments :

KCR shocked with babumohanతెలంగాణ రాష్ట్ర సమితి కి , కేసీఆర్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు తాజా మాజీ శాసనసభ్యుడు , సినీ నటుడు బాబుమోహన్. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధినేత అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు బాబుమోహన్. తెలుగుదేశం పార్టీకి చెందిన బాబుమోహన్ గత ఎన్నికల సమయంలో కెసిఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరాడు . ఆందోల్ శాసనసభ నియోజకవర్గ ఎం ఎల్ ఏ గా గెలిచాడు , అయితే ఆ సమయంలో మంత్రి పదవి వస్తుందని భావించాడు కానీ పదవి దక్కలేదు దాంతో మిన్నకుండి పోయాడు కానీ ఈసారి ఏకంగా టికెట్ నిరాకరించడంతో షాక్ తిన్న బాబుమోహన్ తనకు టికెట్ కేటాయించకపోవడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయాడు దాంతో కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకొని భారతీయ జనతా పార్టీలో చేరాడు.

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున బాబుమోహన్ ఆందోల్ నుండి పోటీ చేయనున్నాడు . ఆమేరకు భారతీయ జనతా పార్టీ నుండి హామీ లభించినట్లు తెలుస్తోంది. బాబుమోహన్ సినీ నటుడు కావడంతో తమకు లాభిస్తుందని భావిస్తున్నారు భాజపా నాయకులు. మొత్తానికి బాబుమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల ఆందోల్ లో టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితి రావడం ఖాయం .

English Title: KCR shocked with babumohan



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2xL2LwH

No comments :

Post a Comment