Saturday, September 1, 2018
అవమానించడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడట
బాలీవుడ్ లో రూపొందుతున్న మణికర్ణిక వివాదాలు సృష్టిస్తూనే ఉంది . ఇప్పటికే దర్శకులు క్రిష్ ఆ సినిమా నుండి తప్పుకున్నారని అందుకు కంగనా రనౌత్ వ్యవహారశైలి కారణం అంటూ వార్తలు వస్తుండగా తాజాగా జరిగిన మరో సంఘటనతో అది నిజమే అనిపిస్తోంది . తాజాగా ప్యాచ్ వర్క్ షూటింగ్ జరుగగా ఆ షూటింగ్ లో భాగంగా డైరెక్టర్ గా కంగనా రనౌత్ పేరు ఉన్న క్లాప్ బోర్డు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది కాగా ఇప్పుడు సోను సుద్ అనే నటుడు కూడా మణికర్ణిక సినిమా నుండి తప్పుకున్నాడని తెలుస్తోంది అందుకు కారణం కంగనా రనౌత్ పొగరుగా వ్యవహరిస్తూ సోనూ సుద్ ని అవమానించడమేఅని అంటున్నారు .
సోనూ సుద్ సదాశివ్ అనే మరాఠా రాజుగా నటిస్తున్నాడు మణికర్ణిక చిత్రంలో , షూటింగ్ పార్ట్ కూడా చాలాభాగం అయ్యిందట కానీ లొకేషన్ లో తనపట్ల కంగనా వ్యవహరిస్తున్న తీరుతో నొచ్చుకొని మణికర్ణిక యూనిట్ కు గుడ్ బై చెప్పాడట ! కంగనా రనౌత్ వ్యవహారశైలి గతకొంత కాలంగా వివాదాస్పదం అవుతూనే ఉంది . హృతిక్ రోషన్ తో ఆమె వ్యవహారం పెద్ద దుమారమే రేపింది .
English Title: actor sonu sood quit manikarnika movie

from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ND3p5t

No comments :
Post a Comment