Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, September 30, 2018

రేవంత్ రెడ్డి సవాల్ ని స్వీకరించే దమ్ము లేదా

No comments :

Revanth reddy challenges to kcrతెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. సిట్టింగ్ జడ్జి తో విచారణకు నేను సిద్ధం , నా ఆస్తులు అలాగే నీ ఆస్తుల గురించి విచారణ చేయిద్దామా ? విచారణలో నేను అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లైతే కమిషనే తేల్చుతుంది ఎవరు అక్రమ ఆస్తులు కూడబెట్టారనేది అంటూ నిన్న కేసీఆర్ కు సవాల్ విసిరాడు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ సవాల్ విసిరగా దానికి బదులుగా టీఆర్ఎస్ శ్రేణులు , నాయకులు పెద్ద ఎత్తున రేవంత్ పై విరుచుకు పడ్డారు కానీ సవాల్ ని మాత్రం స్వీకరించలేదు .

రేవంత్ పై అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు అయతే ఆ ఆరోపణలు నిరూపించడానికి రేవంత్ చెపినట్లు సిట్టింగ్ జడ్జీ తో విచారణ చేయిస్తే సరిపోతుంది కానీ రేవంత్ సవాల్ ని పట్టించుకోకుండా ఎదురుదాడి మాత్రం చేస్తున్నారు. రేవంత్ అంటే చాలు నిలువెల్లా ఊగిపోతున్నారు టీఆర్ఎస్ నాయకులు. కొడంగల్ లో రేవంత్ ని ఓడించాలని కసిగా ఉన్నారు కేసీఆర్ అండ్ కో. మరి రేవంత్ రెడ్డి ని ఓడించడం వీళ్ళ వల్ల అవుతుందా ? కొద్దిరోజులు ఆగితే కానీ తెలీదు.

English Title: Revanth reddy challenges to kcr



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QeGBtM

No comments :

Post a Comment