Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, September 30, 2018

విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు

No comments :

Vijay devarakonda meets kamal hassanవిజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు. పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాల పుణ్యమా అని ఎక్కడాలేని క్రేజ్ విజయ్ దేవరకొండ వశం అయ్యింది. అందుకు ఉదాహరణే తమిళ బిగ్ బాస్ . లెజెండ్ కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ షో పూర్తి అవుతున్న సందర్భంగా గెస్ట్ గా విజయ్ దేవరకొండ ని ఆహ్వానించారు. కమల్ నిర్వహిస్తున్న షోకి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ హాజరు కావడం అంటే మాటలు కాదు , గొప్ప అవకాశం అనే చెప్పాలి.

తాజాగా ఈ హీరో తమిళంలో నటించిన చిత్రం నోటా. ఆ చిత్రం అక్టోబర్ 5న విడుదల అవుతోంది దాంతో బిగ్ బాస్ 2 హౌజ్లోకి వెళ్లినట్లు ఉంటుంది తన సినిమా ప్రమోషన్ కు ఉపయోగపడుతుంది కూడా అని భావించి వెళ్ళాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కాస్త పరిచయమైన విజయ్ నోటా తో నేరుగా పలకరించబోతున్నాడు. ఇక ఈ హీరోని తమిళ ప్రేక్షకులు ఆదరించి అక్కున చేర్చుకుంటారా ? లేదా ? అన్నది మరో ఐదు రోజుల్లోనే తేలిపోనుంది. తెలుగు , తమిళ రాష్ట్రాల్లో రాజకీయ వేడి రగిలిన ఈ సమయంలో నోటా రిలీజ్ కావడం అంటే అదృష్టమే !

English Title: Vijay devarakonda meets kamal hassan



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2y3PFKo

No comments :

Post a Comment