Monday, October 1, 2018
ఇంకా 23 కోట్లు రాబట్టే సత్తా ఈ హీరోలకు ఉందా ?
ఈనెల 27న విడుదలైన దేవదాస్ మూడు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12 కోట్ల షేర్ సాధించింది, అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 23 కోట్ల షేర్ రాబట్టాలి . మరి అంతటి సత్తా అక్కినేని నాగార్జున కు నాని కి ఉందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న గా మారింది. మొదటి వారంలో ఎంత ఎక్కువ రాబడితే అంత మంచిది లేదంటే రెండో వారంలో భారీ మొత్తాన్ని రికవరీ చేయడం కష్టమే ! వీకెండ్ ని కాస్త అటు ఇటుగా సద్వినియోగం చేసుకుంది దేవదాస్ చిత్రం . కానీ 35 కోట్ల షేర్ వసూల్ చేయడం కష్టమనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
మొదటి మూడు రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 9 కోట్ల షేర్ వసూల్ చేయగా ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా లో మిగతా మూడు కోట్లు వసూల్ అయ్యాయి. అయితే మొదటి వారం అంతా కలిపి 18 కోట్ల షేర్ వస్తే గొప్పే అంటున్నారు ఎందుకంటే వసూళ్లు నిన్న తగ్గాయి కాకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి మెరుగ్గానే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక సోమవారం నుండి దేవదాస్ కు అసలైన పరీక్ష మొదలుకానుంది. 35 కోట్ల షేర్ రాకపోతే నిర్మాతకు పోయేది ఏమీలేదు కానీ బయ్యర్లకు మాత్రం నష్టం తప్పదు.
English Title: Will devadas collect 23 crores from box-office
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2xN85zX
No comments :
Post a Comment