Search This Blog

Powered by Blogger.

Blog Archive

Wednesday, October 31, 2018

మురుగదాస్ పరువు పోయింది

No comments :

It's shame murugadossదర్శకులు మురుగదాస్ కు దేశ వ్యాప్తంగా ఏనలేని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి , ముఖ్యంగా గజినీ చిత్రంతో అయితే మొదటి నుండి ఈ దర్శకుడి పై కాపీ కథలు అంటూ రూమర్ లు వచ్చేవి కానీ అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ తాజాగా సర్కార్ చిత్ర కథ నాదే అంటూ వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి రచయితల సంఘం ని ఆశ్రయంచడమే కాకుండా అక్కడ న్యాయం జరగకపోవడంతో కోర్టుని ఆశ్రయించాడు . ఇక మురుగదాస్ అయితే రాజేంద్రన్ చాలా తప్పు చేస్తున్నాడు ఆ కథ నేను రాసుకున్నదే అంటూ పెద్ద ఫోజు కొట్టాడు కట్ చేస్తే సినిమా విడుదల ముందు పరువు తీసుకోవడం ఎందుకు అని భావించి వరుణ్ రాజేంద్రన్ తో రాజీ చేసుకున్నాడు .

అతడికి 30 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు అంగీకరించాడట . నిన్నటి వరకు ఫోజు కొట్టి ఇప్పుడేమో అతడితో రాజీ అంటే మురుగదాస్ తప్పు చేసినట్లే కదా ! ఇంతకుముందు కూడా కత్తి సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది . ఎవరి కథ నో దొంగిలించడానికి ఎలా మనస్కరిసుంది . ఎన్నో ఆశలతో ఆశయాలతో చిత్ర పరిశ్రమకు వచ్చే వాళ్ళ కథలను రాబరీ చేసి వాళ్ళ ఆశలపై నీళ్ళు జల్లుతున్నారు కొంతమంది పెద్ద మనుషుల వేషంలో ఉన్న దుర్మార్గులు . సామజిక అంశాలతో సినిమాలు చేసే మురుగదాస్ ఇలా చేయడం ముమ్మాటికి దారుణం . ఎంత పరువు తక్కువ మురుగా …….

English Title: It’s shame murugadoss



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2CRZVcH

No comments :

Post a Comment