Search This Blog

Powered by Blogger.

Blog Archive

Thursday, November 15, 2018

ఆ సినిమాని రిజెక్ట్ చేసాడట

No comments :

Sudheer babu walks out from new movieమహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు కొద్దిరోజుల క్రితం ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు , ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది కట్ చేస్తే ఆ సినిమా నుండి సుధీర్ బాబు తప్పుకున్నాడట ! పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు లో ప్రారంభమైంది అయితే రెగ్యులర్ షూటింగ్ కి వచ్చేసరికి మేకర్స్ కి సుధీర్ బాబు కి తేడా అవడంతో కలహాలతో షూటింగ్ చేసే బదులు తప్పుకుంటే బెటర్ అని భావించిన సుధీర్ బాబు తనకు ఇచ్చిన అడ్వాన్స్ ని కూడా తిరిగి ఇచ్చేశాడట . దాంతో ఆ సినిమా ఆగిపోయింది , సుధీర్ బాబు సినిమా నుండి తప్పుకోవడంతో రిజ్వాన్ సినిమా డైలమాలో పడింది .

నన్ను దోచుకుందువటే చిత్రాన్ని నిర్మించి , నటించి మంచి హిట్ కొట్టేసాడు సుధీర్ బాబు , అలాగే ఈ ఏడాది సమ్మోహనం చిత్రం కూడా మంచి విజయం సాధించింది . ఈ ఏడాదిలో 2 చిత్రాలు కూడా హిట్ కావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు సుధీర్ బాబు . మంచి హిట్స్ వస్తున్నాయి కానీ సాలిడ్ హిట్స్ మాత్రం రావడం లేదు ఈ హీరోకు . సూపర్ హిట్ ఒకటి తగిలితే తన రేంజ్ పెరుగుతుందని భావిస్తున్నాడు కానీ అది మాత్రం సుధీర్ ని వరించడం లేదు పాపం . ప్రస్తుతం గోపీచంద్ బయోపిక్ కోసం కష్టపడుతున్నాడు . బాలీవుడ్ లో కూడా గోపీచంద్ బయోపిక్ రూపొందనుంది . మరి ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో !

English Title: Sudheer babu walks out from new movie



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zS1fsZ

No comments :

Post a Comment