Sunday, November 11, 2018
“సిరివెన్నెల”గా ప్రియమణి
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకొని ఎన్నో ప్రశంసలు అందుకున్న ప్రియమణి… తెలుగులో పలు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త దూరమైంది. అయితే తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఏ ఎన్ బి కోర్డినేటర్స్ బ్యానర్ పై ఏ ఎన్ భాషా, రామ సీత నిర్మాతలుగా ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో తెరకెక్కించనున్న “సిరివెన్నెల” అనే చిత్రం ద్వారా ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుంది. తెలుగు చిత్ర సీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే “సిరివెన్నెల”
సినిమా టైటిల్ ఇన్నాళ్ల తర్వాత మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రియమణి చాలా కథలు విన్నప్పటికీ “సిరివెన్నెల” కథ బాగా నచ్చడం పెర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకుంది. ప్రియమణికి పర్ ఫెక్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మూవీగా సిరివెన్నెల ఉండనుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు… జూనియర్ మహానటిగా మంచిపేరు తెచ్చుకున్న సాయి తేజస్విని, బాహుబలి చిత్రంలో కిలి కిలి భాషతో భయంకరమైన విలన్ గా నటించిన కాలకేయ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2JTzRzk

No comments :
Post a Comment