Search This Blog

Powered by Blogger.

Blog Archive

Saturday, November 17, 2018

ఎన్టీఆర్ ని అవమానించినట్లే

No comments :

TDP ignored NTRకూకట్ పల్లి నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీ చేయడానికి సిద్దమయ్యింది . అయితే ఈ స్థానంలో ముందుగా కళ్యాణ్ రామ్ ని పోటీ చేయించాలని చూసారు , స్వయంగా బాలయ్య కళ్యాణ్ రామ్ ని అడిగాడట కూడా కానీ ఇప్పట్లో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని బాలయ్య బాబాయ్ సూచన ని పక్కన పెట్టాడు కళ్యాణ్ రామ్ దాంతో హరికృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరుపున న్యాయం చేయడం కోసంతో పాటుగా హరికృష్ణ మరణం యొక్క సానుభూతి కోసం హరికృష్ణ కూతురు సుహాసిని ని అసెంబ్లీ బరిలో నిలుపుతున్నారు . ఆమేరకు కుటుంబ సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు అయితే ఎన్టీఆర్ ని మొదట సంప్రదించలేదు కాకపోతే అంతా ఖరారు అయ్యాక ఓ మాట గా మాత్రం చెప్పారట .

అంటే ఎన్టీఆర్ ని ఇంకా దూరం పెడుతున్నట్లు స్పష్టం అవుతూనే ఉంది . కొద్దిరోజుల కిందట రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే . పైగా హైదరాబాద్ లో సీమాంధ్ర ఓట్లు గణనీయంగా ఉన్నాయి అందునా కూకట్ పల్లి లో మరీను అందుకే తెలుగుదేశం పార్టీ తరుపున సుహాసిని ని పోటీ చేయిస్తున్నారు . కళ్యాణ్ రామ్ ఒప్పుకొని ఉంటే అతడే అభ్యర్థి అయ్యేవాడు . అయితే ఈ ప్రాసెస్ లో ఎన్టీఆర్ ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు దాంతో ఎన్టీఆర్ కు ఇది అవమానమే ! అని అంటున్నారు .

English Title: TDP ignored NTR



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2RUtFdl

No comments :

Post a Comment