Friday, November 16, 2018
ఏం మాట్లాడుతున్నావ్….. కేసీఆర్ !
యుద్దానికి వెళ్తున్నా ! మీ ఆశీర్వాదం కావాలి ……. వంద స్థానాల్లో గెలబోతున్నాం అంటూ నిన్న కోనాయిపల్లిలో ప్రజలనుద్దేశించి కేసీఆర్ చెప్పిన మాటలు ఇవి . కేసీఆర్ యుద్ధం చేసేవాడే అయితే ఇంకా 9 నెలల పాటు అధికారంలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ అసెంబ్లీ ని రద్దు చేసి యుద్ధం నుండి పారిపోయిన వ్యక్తి కేసీఆర్ కానీ ఇప్పుడు మాత్రం యుద్దానికి వెళ్తున్నా ఆశీర్వదించండి అని అంటూనే వంద సీట్లలో గెలవబోతున్నాం అంటూ చెప్పడం వింతగా ఉందని సోషల్ మీడియాలో కేసీఆర్ పై విమర్శలు కురిపిస్తున్నారు జనాలు . మహాకూటమి కూడా ఇదే విమర్శలు గుప్పిస్తోంది తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై .
అయిదేళ్ల పాటు అధికారం చేపట్టమని అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాడు . ఎందుకు ప్రభుత్వాన్ని రద్దు చేశావయ్యా అంటే ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయి అందుకే రద్దు అని అంటున్నాడు కానీ ప్రతిపక్షాల పనే పదేపదే విమర్శించడం . ఎవరో ఏదో అన్నారని ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళితే …… రేపు మళ్ళీ ఎన్నికయ్యాడు అనుకుందాం …… మళ్ళీ మళ్ళీ విమర్శిస్తారు కదా ! మరి అప్పుడు ఏం చేస్తాడు అన్న విమర్శలు కూడా కేసీఆర్ పై వస్తున్నాయి . ఇక చీటికీ మాటికీ చంద్రబాబు ని విమర్శించడం తప్ప మేము చేసిన పనులు ఇవి అంటూ ప్రచారం మాత్రం చేయడం లేదు ఏంటో !
English Title: Netizens angry on kcr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OKWwyC

No comments :
Post a Comment