Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, November 11, 2018

బాలయ్య ని పిలవలేదా ? లేక రాలేదా

No comments :

No invitation for balakrishna from RRR?ఈరోజు ఎన్టీఆర్, చరణ్ లు నటించనున్న చిత్ర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం హాజరుకాలేదు దాంతో ఈ వేడుకకు బాలయ్య ని పిలవలేదా ? లేక తానే రాలేదా ? అన్న చర్చ నడుస్తోంది . రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిస్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు డివివి దానయ్య . 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈరోజు హైదరాబాద్ సమీపంలోని అల్యుమియం ఫ్యాక్టరీ లో ప్రారంభం అయ్యింది . ఈ ప్రారంభోత్సవానికి అతిరధ మహారధులు హాజరయ్యారు . అందులో చిరంజీవి కూడా ఉన్నాడు . కానీ బాలయ్య మాత్రం రాలేదు .

ఈ వేడుకకు బాలయ్య ని పిలిచారా ? లేదా ? అన్నది సరిగ్గా తెలీదు కానీ బాలయ్య రాకపోవడంతో ఓ సంకేతం అయితే వేరుగా వెళుతోంది . నిన్న మొన్నటి వరకు బాలయ్య – ఎన్టీఆర్ ల మద్య దూరం ఉండేది కానీ ఈమధ్యే దగ్గరయ్యారు . ఇక ఈ వేడుకకు బాలయ్య కూడా వచ్చి ఉంటే మరింతగా బాగుండేది కానీ రాకపోవడం వల్ల పెద్ద లోటు కనిపిస్తోంది . టాలీవుడ్ హిస్టరీ ని సరికొత్త పుంతలు తోక్కించే మల్టీ స్టారర్ చిత్రం గా రానుంది ఈ ఆర్ ఆర్ ఆర్ .

English Title: No invitation for balakrishna from RRR?

Young Tiger NTR, Mega Powerstar Ram Charan’s Massive Multistarrer with Ace Director SS Rajamouli launched



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2OCquEU

No comments :

Post a Comment