Search This Blog

Powered by Blogger.

Blog Archive

Friday, November 30, 2018

క్యాన్సర్ తో బాధపడుతున్న హీరో భార్య

No comments :

Ayushman khurrana wife tahira kashyap revealed her cancerరొమ్ము క్యాన్సర్ తో బాధపడుతోంది బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తాహీరా కశ్యప్ . అయితే ఆ క్యాన్సర్ ప్రాధమిక దశలోనే ఉందని గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకుంటోంది తాహీరా కశ్యప్ . క్యాన్సర్ బారిన పడ్డానని కుంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని మరీ ఈ విషయాన్నీ పబ్లిక్ లో పెట్టేసింది . క్యాన్సర్ మహమ్మారి ని జయిస్తాను , కాకపోతే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాను …….. ప్రాథమిక దశలోనే రొమ్ము క్యాన్సర్ ని గుర్తించామని కాబట్టి ఎవరూ నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది .

విక్కీ డోనర్ అనే సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రంలో నటించాడు ఆయుష్మాన్ ఖురానా . తాహీర కశ్యప్ – ఆయుష్మాన్ ఖురానా లకు ఇద్దరు పిల్లలు . అయితే ఇటీవలే క్యాన్సర్ పరీక్షలు చేయించుకోగా రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు రిపోర్ట్ లో వెల్లడి కావడంతో చికిత్స పొందుతోంది . తప్పకుండా త్వరగా కోలుకుంటానన్న నమ్మకం ఉందని చెప్పడమే కాకుండా …… ” ఫ ….. క్యాన్సర్ ” అంటూ క్యాప్షన్ పెట్టి ఓ ఫోటోకి ఫోజిచ్చింది . దాన్నే సోషల్ మీడియాలో పెట్టేసింది .

English Title: Ayushman khurrana wife tahira kashyap revealed her cancer



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ra5qN1

No comments :

Post a Comment