Saturday, November 10, 2018
మురుగదాస్ ని అరెస్ట్ చేస్తారా
సర్కార్ చిత్రం ఎప్పటికప్పుడు వివాదాలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే బోలెడు వివాదాలు సర్కార్ ని ఉక్కిరిబిక్కిరి చేయగా తాజాగా దర్శకుడు మురుగదాస్ ని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నారు పలువురు. దాంతో కోర్టు ని ఆశ్రయించాడు మురుగదాస్. నిన్న రాత్రి మురుగదాస్ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. అయితే ఆ సమయంలో ఇంట్లో మురుగదాస్ లేకపోవడంతో పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. ఈ విషయం మురుగదాస్ కి కుటుంబ సభ్యులు తెలపడంతో ఖంగారుపడిన దర్శకుడు కోర్టుని ఆశ్రయించాడు. తనని అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోర్టుని కోరడంతో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అంతేకాదు మాకు తెలియకుండా మురుగదాస్ ని అరెస్ట్ చేయకూడదని ఆదేశాలు జారీచేసింది న్యాయస్థానం. న్యాయమూర్తి ఆదేశాలతో ఊపిరి పీల్చుకున్న మురుగదాస్ నేను కావాలని ఎవరిని ఉద్దేశించి సినిమా తీయలేదని తెలిపాడు. మురుగదాస్ కు మద్దతుగా పలువురు సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఇక రజనీకాంత్ , కమల్ హాసన్ లు కూడా పూర్తి మద్దతు తెలిపారు. మురుగదాస్ తీసిన సినిమాలు వివాదాలు సృష్టించాయి అయితే అన్నింటినీ మించి ఈ సర్కార్ చిత్రం పెద్ద పెద్ద వివాదాలు రాజేసి అందరినీ ఇబ్బంది పెడుతోంది.
English Title: Will chennai police arrests Murugadoss ?
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2z3k0tV

No comments :
Post a Comment