Sunday, November 11, 2018
విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథ అది
టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ వేణు ఉడుగుల చేసిన ప్రయత్నం ఫలించలేదు దాంతో అదే కథ ని రానా కు చెప్పగా వెంటనే ఓకే చేసాడట దాంతో ”విరాటపర్వం 1992” అనే చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది . నీది నాది ఒకే కథ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల ఆ చిత్రం ఇచ్చిన ఊపుతో విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనీ ఆశించాడు . విజయ్ కూడా కథ వినడానికి అంగీకరించాడు కానీ కథ విన్నాక ఎందుకో కుదరదు బాస్ అంటూ రిజెక్ట్ చేసాడట ! దాంతో చేసేదిలేక తమిళ స్టార్ హీరో కార్తీ కి కూడా ఇదే కథ చెప్పగా అతడు కూడా నో చెప్పాడట .
ఇక అక్కడి నుండి శర్వానంద్ ని కలిసాడు , శర్వా కూడా హ్యాండ్ ఇవ్వడంతో రానా దగ్గరకు వెళ్ళింది విరాటపర్వం 1992. ముగ్గురు రిజెక్ట్ చేసిన కథ రానా కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . కట్ చేస్తే వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రంగం సిద్దం చేసుకుంటోంది . రానా కు ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉంది కాబట్టి యంగ్ డైరెక్టర్ వేణు కి ఇది గోల్డెన్ చాన్స్ అనే చెప్పాలి . ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే నోటా తో డిజాస్టర్ అందుకున్న తర్వాత టాక్సీ వాలా అంటూ వస్తున్నాడు మరి ఇది ఏమౌతుందో !
Englih Title: Vijay devarakonda rejected rana accepted
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2DxLhZk

No comments :
Post a Comment