Monday, November 12, 2018
“నేను లేను” టీజర్ విడుదల
ఓ.యస్.యం విజన్ మరియు దివ్యాషిక క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నేను లేను”. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉపశీర్షిక. హర్షిత్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ టీజర్ ను విడుదలచేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ … అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం నేను లేను .చిత్రీకరణ పూర్తయింది. డిటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెలలొనె పాటలను విడుదల చెస్తాము. కథనం, సంగీతం, కెమెరావర్క్ మా సినిమాకు ఎసెట్ గా నిలుస్తాయన్నారు.
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్, ఛాయాగ్రహణం:ఎ. శ్రీకాంత్ (బి.ఎఫ్.ఎ), నృత్యాలుఃజోజో, నిర్వాహణ:సురేష్‌కూరపాటి, పి.ఆర్.ఓ:సాయిసతీష్‌పాలకుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్రఫీ:రంగరాజ్, కలరిస్ట్ః కళ్యాణ్ ఉప్పాలపాటి, ప్రచార చిత్రాలు: శ్రీక, సహాయదర్శకులు: జె.మోహన్‌కాంత్, దర్మేంద్ర, సురేశ్. సహ నిర్మాత : యాషిక , నిర్మాత : సుక్రి కుమార్ రచన , దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్ .ఎస్ .కె
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2De50MC

No comments :
Post a Comment