Search This Blog

Powered by Blogger.

Blog Archive

Friday, November 30, 2018

విబేధాలను పక్కన పెట్టి కలుస్తారా ?

No comments :

Differences between venkateshwar rao and chandrababu ఎన్టీఆర్ కుటుంబంలో నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి . ఎన్టీఆర్ కుటుంబం చాలా పెద్దది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ సంతానం ఏకంగా 12 మంది దానికి తోడు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బంధువర్గమంతా ఓ గ్రామమే అవుతుంది . అయితే బంధువర్గాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ కుటుంబంలోనే సఖ్యత లేదు , పెద్దల్లుడు వెంకటేశ్వర్ రావు – చిన్నల్లుడు చంద్రబాబు లకు అంతగా పడదు . అయితే ఈ ఇద్దరినీ ఒక్క తాటిపైకి తేవాలని బాలయ్య భావిస్తున్నాడట అది ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుక కోసం .

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు ఇలా రెండు భాగాలుగా 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బాలయ్య . జనవరిలో విడుదల కాబట్టి డిసెంబర్ 16 న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ వేడుక ఎన్టీఆర్ కుటుంబం అందరినీ ఏకతాటి పైకి తెచ్చి చేయాలనీ డిసైడ్ అయ్యాడట బాలయ్య . అయితే అందరినీ ఏకం చేయొచ్చు కానీ వెంకటేశ్వర్ రావు ని ఈ వేడుకకు రప్పించడం కష్టమే కావచ్చు అన్న మాట వినబడుతోంది . ఎందుకంటే చంద్రబాబు అంటే వెంకటేశ్వర్ రావు కు పడదు మరి .

English Title: Differences between venkateshwar rao and chandrababu



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2BFPwzY

No comments :

Post a Comment