Search This Blog

Powered by Blogger.

Blog Archive

Monday, November 12, 2018

కేంద్ర మంత్రి అనంత కుమార్ మృతి

No comments :

Union minister ananth kumar passed awayకేంద్ర మంత్రి అనంతకుమార్ (59) ఈరోజు తుది శ్వాస విడిచాడు . కర్నాటకకు చెందిన ఈ నాయకుడు గతకొంత కాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడు . అయితే ఈరోజు తెల్లవారుఝామున పరిస్థితి మరింత విషమించడంతో 2 గంటలకు కన్నుమూసారు . భారతీయ జనతా పార్టీకి కర్ణాటకలో బలమైన నాయకుడు అయ్యాడు అనంతకుమార్ . లోక్ సభకు వరుసగా ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించాడు . 1996 లో మొదటిసారిగా దక్షిణ బెంగుళూర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందాడు అంతేకాదు వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసాడు .

1996 నుండి దక్షిణ బెంగుళూర్ నుండి వరుసగా ఆరుసార్లు ప్రాతినిధ్యం వహిస్తూ తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యారు అనంతకుమార్ . నరేంద్ర మోడి మంత్రివర్గంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనంతకుమార్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖతో పాటుగా రసాయనాలు , ఎరువులు శాఖని కూడా నిర్వహిస్తున్నారు . కొంతకాలంగా తీవ్ర అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనంతకుమార్ ఎట్టకేలకు అనంతలోకాలకు పయనమయ్యాడు దాంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులలో తీవ్ర విషాదం నెలకొంది .

English Title: Union minister ananth kumar passed away



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2T8zvtd

No comments :

Post a Comment