Search This Blog

Powered by Blogger.

Blog Archive

Friday, November 30, 2018

భారీ అగ్నిప్రమాదం నుండి బయట పడిన షారుఖ్

No comments :

Shahrukh khan escape from fire accident at zero setsకింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ భారీ అగ్ని ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నాడు . ముంబై లో ఓ స్టూడియో లో వేసిన సెట్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది . అగ్నిప్రమాదం జరిగినపుడు షారుఖ్ ఖాన్ అక్కడే ఉన్నాడు దాంతో అప్రమత్తమైన చిత్ర బృందం షారుఖ్ ని అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు . సంఘటన వివరాలలోకి వెళితే …….. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తాజాగా షారుఖ్ ఖాన్ ” జీరో ” అనే చిత్రంలో మరుగుజ్జుగా నటిస్తున్నాడు . ఈ చిత్రంలో షారుఖ్ సరసన కత్రినా కైఫ్ , అనుష్క శర్మ నటిస్తున్నారు .

కాగా జీరో చిత్రం కోసం ఓ పాట చిత్రీకరించడానికి ముంబై లోని ఓ స్టూడియోలో సెట్ వేశారు . సెట్ లో పాట చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో యానిట్ సిబ్బంది షాక్ అయ్యారు . మంటలు మరింతగా ఎగిసి పడకముందే అక్కడి నుండి షారుఖ్ ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు . భారీ ప్రమాదం నుండి షారుఖ్ బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు . జీరో చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈలోగా ఈ సంఘటన జరిగింది .

English Title: Shahrukh khan escape from fire accident at zero sets



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2KHxMH9

No comments :

Post a Comment