Search This Blog

Powered by Blogger.

Blog Archive

Monday, December 24, 2018

వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన నటి

No comments :

Actress Apoorva files complaint on MLA supportersఆంధ్రప్రదేశ్ ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ అనుచరులు నన్ను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నారని సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది నటి అపూర్వ . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా సినిమాల్లో అంతగా నటించడం లేదు , ఛాన్స్ లు కూడా రావడం లేదు . అయితే రాజకీయంగా మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోందట . ఆంధ్రప్రదేశ్ ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ అనుచరులు సోషల్ మీడియాలో నా పరువు మొత్తం తీసేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది .

గుంటూరు జిల్లా కు చెందిన అపూర్వ ఊళ్ళో తన ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ గద్దె నిర్మిస్తున్న ప్రభాకర్ అనుచరులను వారించింది . ఇక అప్పటి నుండి ఎం ఎల్ ఏ తో పాటుగా అతడి అనుచరులు నన్ను వేధిస్తున్నారు , సోషల్ మీడియాలో నా పరువు తీస్తున్నారని అంటోంది . ఇంతకుముందు కూడా ఎం ఎల్ ఏ చింతమనేని పై తీవ్ర ఆరోపణలు చేసింది అపూర్వ . జగన్ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించింది కూడా .

English Title: Actress Apoorva files complaint on MLA supporters



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2BGiu1c

No comments :

Post a Comment