Tuesday, January 1, 2019
జనవరి 2న ‘మిస్టర్ మజ్ను’ టీజర్

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ‘ఏమైనదో.. ఏమైనదో.. పలుకు మరచినట్టు పెదవికేమైనదో..’, మిస్టర్ మజ్ను టైటిల్ సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా, జనవరి 2 సాయంత్రం 6 గంటలకు నూతన సంవత్సర కానుకగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నారు.
అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2GQEaOl

No comments :
Post a Comment