Thursday, January 3, 2019
సినిమా హిట్ కాకపోతే గొంతుకోసుకుంటాడట

సంచలనం సృష్టిస్తున్న ఈ సంఘటన చెన్నై లో జరిగింది . ఇంతకీ ఆ సినిమా ఏంటయ్యా అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమా గురించి . ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు , రజనీకాంత్ అంటే పడి చచ్చిపోయే డైరెక్టర్ అన్నమాట . రజనీకాంత్ కు వీరాభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజు పేట సినిమా హిట్ కాకపోతే నా గొంతు కోసుకుంటా అని సవాల్ విసిరాడట తమిళనాడులో . గతకొంత కాలంగా రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి .అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే 2. ఓ హిట్ అయ్యింది . అయితే కమర్షియల్ హిట్ మాత్రం కాదు దాంతో రజనీ నటించిన ముత్తు , నరసింహా , బాషా చిత్రాల స్థాయిలో ఈ పేట హిట్ అవుతుందని సవాల్ చేస్తున్నాడు . చూడాలి మరి జనవరి 10 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది . హిట్ అవుతుందా ? కార్తీక్ గొంతు బలి తీసుకుంటుందా ?
English Title: Director karthik subbaraju sensational comments on Rajini’s Petta
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2Asdldn

Subscribe to my channel
No comments :
Post a Comment