Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, September 30, 2018

సెటైర్ వేసిన విజయ్ దేవరకొండ

No comments :

Vijay Devarakonda satire on Telugu Censor Boardతమిళనాడు సెన్సార్ సభ్యులు మా నోటా చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారని మరి మన తెలుగు సెన్సార్ సభ్యులు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తారో అని సెటైర్లు వేసాడు హీరో విజయ్ దేవరకొండ. తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం.

అక్టోబర్ 5 న సినిమా విడుదలకు సిద్ధం అవుతుండటంతో తమిళంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయతే ఏ సర్టిఫికెట్ ఇస్తారో ? యు బై ఏ ఇస్తారేమో అని భయపడితే యు సర్టిఫికెట్ ఇచ్చారట తమిళ సెన్సార్ సభ్యులు దాంతో తెలుగువాళ్లు ఏ సర్టిఫికెట్ ఇస్తారేమో అని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే ట్వీట్ చేసి ఆసక్తిని పెంచాడు విజయ్ దేవరకొండ. మరి మన తెలుగు సెన్సార్ బోర్డ్ ఎటువంటి కట్స్ చెబుతుందో ? ఏ సర్టిఫికెట్ ఇస్తుందో చూడాలి.

English Title: Vijay Devarakonda satire on Telugu Censor Board



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2zEeVsJ

No comments :

Post a Comment