Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, September 30, 2018

దేవదాస్ కాపీ అని తేలిపోయింది

No comments :

Devadas movie is a copyమలయాళంలో 2015 లో వచ్చిన భార్గవచరితం మూనమ్ ఖండమ్ అనే చిత్రానికి కాపీ ఈ తెలుగు దేవదాస్. పక్కాగా దొరికిపోయారు దేవదాస్ చిత్ర దర్శక నిర్మాతలు. అయితే రిలీజ్ కి ముందే దేవదాస్ చిత్రం కాపీ అని వార్తలు వచ్చాయి కానీ దర్శక నిర్మాతలు మాత్రం మా సినిమా కాపీ కాదని గుండమ్మ కథ లాంటి గొప్ప సినిమా అన్నట్లు పెద్ద బిల్డప్ కొట్టారు. కాపీ అంటూ కథనాలు వచ్చినప్పటికీ ఒరిజినల్ స్టోరీ అని రిలీజ్ కి ముందు కూడా అన్నారు . కట్ చేస్తే సినిమా విడుదల అయ్యింది మలయాళంలో 2015 లో వచ్చిన భార్గవచరితం -మూనమ్ ఖండమ్ సినిమా అని తేలిపోయింది.

మలయాళంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి డాన్ గా నటించగా శ్రీనివాసన్ డాక్టర్ గా నటించాడు. హాస్యంతో తెరకెక్కిన ఆ చిత్రం మలయాళంలో ప్లాప్ అయ్యింది . కట్ చేస్తే ఇక్కడ డాన్ గా నాగార్జున డాక్టర్ గా నాని నటించారు. కాకపోతే కాస్త హీరోయిజం కోసం ఫైట్స్ , గట్రా పెట్టారు అంతే తేడా ! మలయాళంలో ప్లాప్ అయినట్లుగానే తెలుగులో కూడా దేవదాస్ ప్లాప్ దిశగానే దూసుకుపోతోంది. అయితే మమ్ముట్టి తమ చిత్రం కాపీ అని ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ మాత్రం కాపీ అని ఒప్పుకోవడం లేదే !



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2Qk7Y5L

No comments :

Post a Comment