Search This Blog

Powered by Blogger.

Blog Archive

Thursday, November 15, 2018

మీటు ఉద్యమంపై రవితేజ ఏమన్నాడో తెలుసా

No comments :

Raviteja sensational comments on #MeTooమీటు ఉద్యమం భారత్ ని ఓ కుదుపు కుదిపేస్తోంది . ముఖ్యంగా సినిమారంగంలో వణుకు పుట్టిస్తోంది . ఇక టాలీవుడ్ లో అయితే శ్రీ రెడ్డి ఉదంతం ప్రకంపనలు సృష్టించింది . దాంతో మీటు ఉద్యమం పై మాట్లాడటానికి చాలామంది భయపడ్డారు , ఇప్పటికి భయపడుతున్నారు కానీ హీరో రవితేజ మాత్రం లైంగిక వేధింపుల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు . మీటు ఉద్యమం రావడం మంచిదే అయ్యింది , దీని వల్ల అందరూ సెట్ అయ్యారు లేకపోతే విచ్చలవిడిగా తయారయ్యింది పరిస్థితి , కానీ ఈ మీటు వల్ల టోటల్ సినిమా రంగం సెట్ అయ్యిందని దీనివల్ల ఎవరికీ వారు సర్దుకున్నారని షాకింగ్ కామెంట్స్ చేసాడు రవితేజ .

ఈ హీరో అన్నట్లుగా శ్రీ రెడ్డి ఉదంతం జరుగముందు సినిమారంగంలో ఆడవాళ్ళ తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్ళు . కానీ ఎప్పుడైతే శ్రీ రెడ్డి ఉదంతం వెలుగులోకి వచ్చిందో , దేశవ్యాప్తంగా మీటు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుందో అప్పటి నుండి ఆడవాళ్ళ తో కాస్త క్లోజ్ గా మాట్లాడాలంటే నిజంగానే భయపడుతున్నారు అలాగే సెల్ఫీ లు తీసుకోవడానికి కూడా భయపడుతున్నారు పాపం . పలువురు హీరోయిన్ లు , నటీమణులు లైంగిక వేధింపుల విషయాన్ని చెబుతూ సినిమారంగంలోని పలువురు మగాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు మరి .

English Title: Raviteja sensational comments on #MeToo



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2PXdOxd

No comments :

Post a Comment