Search This Blog

Powered by Blogger.

Blog Archive

Thursday, November 1, 2018

పవన్ కళ్యాణ్ భయపడి పోటీ చేయడం లేదు

No comments :

Pawan kalyan feared in telangana electionsతెలంగాణ ఎన్నికల్లో పొటీ చేయడానికి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు . డిసెంబర్ లో తెలంగాణాలో ఎన్నికలు జరుగబోతున్నాయి అయితే జనసేన తరుపున తెలంగాణలో బరిలో అభ్యర్ధులను నిలపడానికి మాత్రం పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు ఎందుకంటే ఇక్కడ సంస్థాగతంగా పార్టీ బలోపేతం కాలేదు అలాగే పోటీ చేయడం వల్ల తెలంగాణలో ఎలాంటి ప్రయోజనం ఉండదు అని తెలిసిపోయిందట ! జనసేన తరుపున అభ్యర్ధులను పోటీకి నిలిపి అన్ని చోట్లా ఓడిపోయి ఆంధ్రపదేశ్ లో చులకన కాకుండా ఉండేందుకే తెలంగాణలో పోటీ చేయడం లేదని తెలుస్తోంది .

తెలంగాణలో ఎన్నికలు డిసెంబర్ లో జరుగుతుండగా ఆంధ్రపదేశ్ లో ఏప్రిల్ లేదా మే నెలలో శాసన సభకు ఎన్నికలు జరుగనున్నాయి అంటే నాలుగు , లేదా అయిదు నెలల గ్యాప్ అన్నమాట . తెలంగాణలో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల్చుకోక పొతే ఆంధ్రపదేశ్ లో పోటీ అంత రసవత్తరంగా ఉండదు పైగా మిగతా పార్టీల ముందు చులకన అవ్వడం ఖాయమనే తెలంగాణలో పోటీకి దూరంగా ఉంటున్నాడట పవన్ కళ్యాణ్ . ఆంధ్రప్రదేశ్ లో జనసేన ని ప్రభలమైన శక్తిగా ఎదిగేల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ . మరి అతడి వల్ల అవుతుందా ? లేదా ? అన్నది 2019 ఎన్నికల్లో తేలిపోనుంది .

English Title: Pawan kalyan feared in telangana elections



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qnKYHU

No comments :

Post a Comment