Thursday, November 15, 2018
భయపడుతున్న విజయ్ దేవరకొండ
టాక్సీ వాలా చిత్రం విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఆ సినిమా ఏమౌతుందో అన్న భయం నెలకొంది , దాంతో నిలువెల్లా వణికిపోతున్నాడట విజయ్ దేవరకొండ . రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ టాక్సీ వాలా చిత్రం నవంబర్ 17 న విడుదల కానుంది . విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్ నటించగా ఇతర పాత్రల్లో పలువురు నటించారు . అయితే సినిమా విడుదల సమయం దగ్గర పడటంతో విజయ్ లో టెన్షన్ ఎక్కువయ్యిందట . అసలే నోటా సినిమా ప్లాప్ అయ్యింది , రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన నోటా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు విజయ్ కానీ ఆ సినిమా ఘోర పరాజయం పొందింది దాంతో విజయ్ క్రేజ్ కుదుపులకు లోనయ్యింది .
అందుకే టాక్సీ వాలా అయినా హిట్ అయితే కాస్త తేరుకోవచ్చని భావిస్తున్నాడు విజయ్ దేవరకొండ . హర్రర్ కథాంశంతో రూపొందిన టాక్సీ వాలా ఇంప్రెస్ గానే కనిపిస్తోంది అలాగే సెన్సార్ టాక్ కూడా ఫరవాలేదని టాక్ వచ్చింది . అయితే విజయ్ లో ఎక్కడో అనుమానం , టాక్సీ వాలా దెబ్బకొడితే పరిస్థితి ఏంటి ? అని . అందుకే భయం భయంగా ఉందట ఈ హీరోకు . అసలే సినిమా మొత్తం ముందే లీక్ అయ్యింది కాబట్టి విజయ్ టెన్షన్ పడుతున్నాడు పాపం .
English Title: Vijay devarakonda scared with Taxiwala
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2QDFyUK
No comments :
Post a Comment