Wednesday, November 28, 2018
సెన్సార్ చిక్కుల్లో ఆ సినిమా
రాంగోపాల్ వర్మ నిర్మించిన భైరవగీత చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడింది . గతనెల రోజులుగా ఇదిగో విడుదల అదిగో విడుదల అంటూ ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న వర్మ ఎట్టకేలకు రజనీకాంత్ నటించిన 2 . ఓ చిత్రానికి మా భైరవగీత చిత్రానికి పోటీ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి పడేసాడు . 2. ఓ 29 న విడుదల అవుతుంటే దానికి ఒకేరోజు ఆలస్యంగా నవంబర్ 30 న మా భైరవగీత అంటూ ఫోజు కొట్టాడు . కట్ చేస్తే ఇప్పుడు సెన్సార్ సమస్యల్లో ఉంది భైరవగీత చిత్రం దాంతో నవంబర్ 30 న రావడం లేదు డిసెంబర్ 7న మా సినిమా విడుదల అంటూ పోస్ట్ పెట్టాడు వర్మ .
భైరవగీత చిత్రంలో హీరోయిన్ ల అందాలు మాత్రమే కాకుండా కత్తులు , నరకడాలు ఉన్నాయి దాంతో ఈ సినిమా సకాలంలో సెన్సార్ కావడం కష్టమే అందుకే డిసెంబర్ 7న విడుదల అనేశాడు . అయినా వర్మ సినిమాలన్నీ పరమచెత్త గా తయారయ్యాయి ఈమధ్య . కాకపోతే ఈ సినిమా వర్మ శిష్యుడు దర్శకత్వం వహించిన సినిమా అందునా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా కావడంతో కాస్త అంచనాలు ఉన్నాయి అంతే !
English Title: Ram gopal varma Bhairavageetha postponed again
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FN4eJv
No comments :
Post a Comment