Search This Blog

Powered by Blogger.

Blog Archive

Sunday, December 23, 2018

`నేను లేను` టీజర్ 20ల‌క్ష‌ల వ్యూస్, ఫిబ్ర‌వ‌రి రిలీజ్

No comments :

nenu lenu teaser 20 lakh views February releaseఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `నేను లేను`. `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరో. ఇటీవ‌లే టీజర్ విడుదలై 20ల‌క్ష‌ల (2మిలియన్) డిజిట‌ల్ వ్యూస్‌ను అందుకుంది. చిత్రీక‌ర‌ణ స‌హా అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. ఈనెల 24న ట్రైల‌ర్ ను, ఫిబ్ర‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ -“ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి క‌ట్టిస్తుంది. ఇటివలే విడుదలైన టీజర్ కి అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. థ్రిల్లింగ్ కాన్సెప్టుతో తీస్తే న‌వ‌త‌రం నటీన‌టుల‌తో తీసిన సినిమా అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అనే నమ్మకం ఉంది. టీజ‌ర్‌కి 20ల‌క్ష‌ల‌ వ్యూస్ రావడం మ‌రింత నమ్మకాన్నిపెంచింది . అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. ఈనెల 24న ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసి, అటుపై ఫిబ్ర‌వ‌రిలో సినిమాను విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు భార‌త‌దేశంలో రాని సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న చిత్రమిద‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం“ అన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం:ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌:సాయి స‌తీష్ పాల‌కుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్:పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ:రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్ః క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌, స‌హ‌నిర్మాత : య‌షిక, నిర్మాత : సుక్రి కుమార్, రచన- దర్శకత్వం : రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె

 



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews http://bit.ly/2T5JNsW

No comments :

Post a Comment