Search This Blog

Powered by Blogger.

Blog Archive

Saturday, December 1, 2018

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

No comments :

Revanth reddy Taken sensational decisionఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు . తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఎంతగా చెప్పినా , ఎంతగా మొత్తుకున్నా ప్రయోజనం లేకపోవడంతో పోలీసుల వైఖరికి , ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు రోజుల పాటు ప్రచారం చేయకూడదనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి . కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పట్ల నిరంకుశ వైఖరి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . దాంతో ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ వ్యవహారశైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు .

ప్రచారం కోసం ప్రజల వద్దకు వెళ్తున్నానని , అయితే నన్ను అంతం చేయడానికి పెద్ద కుట్ర చేసారని అందుకే తగిన రక్షణ కల్పించాల్సిందిగా కోరినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అందుకే ప్రచారాన్ని వాయిదా వేసుకున్నానని అంటున్నాడు . డిసెంబర్ 7 న పోలింగ్ దాంతో మరో అయిదు రోజుల పాటు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది కాబట్టి ఇది కీలకం కానీ కీలకమైన సమయంలో ప్రచారం చేయకుండా హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నాడు రేవంత్ రెడ్డి . మరి ఈ ఆరోపణలపై తెలంగాణ పోలీసులు , ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి .

English Title: Revanth reddy Taken sensational decision



from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ABbiD8

No comments :

Post a Comment