Thursday, December 20, 2018
సమాజంలోని చీకటి కోణాలపై `దాడి`

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – “ఏడాది పాటు అమెరికాలో ఉన్నాను. గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇదే. యు.ఎస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత చాలా కథలు విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ మధు మంచి స్క్రిప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నా గత సినిమాలకు భిన్నమైన ప్రయత్నమిది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఇందులో కనపడతాను. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాలు వెనుక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశాననేదే ఈ కథ. మణిశర్మ సంగీతం సినిమాకు ప్రధాన బలం. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్‌కెళతాం“ అన్నారు.
డైరెక్టర్ మధు శోభ.టి మాట్లాడుతూ – “అన్నీ రకాల ఎమోషన్స్ ఉండే చిత్రమిది. యూత్‌కు మంచి సందేశం ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనుకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్ కథ ఇది. కచ్చితంగా హిట్ సాధిస్తాననే నమ్మకం ఉంది“ అన్నారు.
నిర్మాత శంకర్ ఆర్ల మాట్లాడుతూ – “మంచి సందేశం ఉన్న చిత్రం. వరుణ్ సందేశ్ తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. దర్శకుడు మధు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి నిర్మాతగా మారాను“ అన్నారు.
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2ECoQCP

No comments :
Post a Comment