Thursday, November 15, 2018
కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్న చంద్రబాబు
కేసీఆర్ తొందరపడి 105 మందితో జాబితా విడుదల చేసాడని , అత్యుత్సాహంతో చేసిన ఆ పనితో కేసీఆర్ మట్టి కరవడం ఖాయమని తెలంగాణాలో మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . అమరావతి లో మీడియా తో మాట్లాడిన చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పడు సంచలనం సృష్టిస్తున్నాయి . 9 నెలలు సమయం ఉన్నప్పటికీ తొందరపడి ప్రభుత్వాన్ని రద్దుచేసి తప్పు చేసాడని , అలాగే కొంగర కలాన్ సభ తర్వాత కేసీఆర్ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని తెలంగాణలో వంద సీట్లు మావే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అక్కడ చిత్తుగా ఓడిపోతున్నాడని మహాకూటమి అధికారంలోకి వస్తోందని జోస్యం చెప్పాడు చంద్రబాబు .
ఈరోజు ముహూర్త బలం చూసుకొని మరీ నామినేషన్ దాఖలు చేసాడు కేసీఆర్ . మళ్ళీ గజ్వెల్ నుండి పోటీ చేస్తున్నాడు . తెలంగాణలో మళ్ళీ అధికారం మనదే అంటూ విజయ సంకేతాన్ని చూపించాడు కేసీఆర్ . అయితే పలు సర్వేలు తెలంగాణలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి . మళ్ళీ అధికారం టీఆర్ఎస్ దే అని కొన్ని సర్వేలు చెబుతుండగా కొన్ని సర్వేలు మాత్రం మహాకూటమి దే విజయమని తేల్చి చెబుతున్నాయి . ఇక చంద్రబాబు నాయుడు కూడా మహాకూటమి దే విజయమని కేసీఆర్ ఓడిపోతున్నాడని అంటున్నాడు . అయితే ఎవరి సత్తా ఏంటి ? గెలిచేది ఎవరు ? అన్నది మాత్రం ప్రజలు డిసెంబర్ 7 న ప్రకటించనున్నారు .
English Title: Chandrababu naidu sensational comments on kcr
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2K1Q2uw
No comments :
Post a Comment