Thursday, November 15, 2018
వాళ్లిద్దరూ విడిపోయారట
మేమిద్దరం విడిపోయామని అంటున్నాడు తమిళ నటుడు విష్ణు విశాల్ . చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ లు అనుకుంటున్న హీరో విష్ణు విశాల్ , అయితే తాజాగా తన భార్య రజనీ తో విడాకులు తీసుకున్నానని గత ఏడాది నుండి మేము విడిపోయి దూరంగా ఉంటున్నామని ఎట్టకేలకు ఇప్పుడు విడాకులు మంజూరు అయ్యాయని అంటున్నాడు విష్ణు విశాల్ . 2011 లో రజనీ ని పెళ్లి చేసుకున్నాడు విష్ణు విశాల్ . అయిదేళ్ల పాటు కాపురం బాగానే సాగింది , ఆ కాపురానికి గుర్తుగా ఒక కుమారుడు కూడా పుట్టాడు . అయితే రెండేళ్లుగా ఇద్దరి మధ్య విబేధాలు ఎక్కువయ్యాయి , ఇంట్లో తరచుగా గొడవపడి శత్రువులుగా మారే బదులు విడిపోతే మంచిదని ఇలా నిర్ణయం తీసుకున్నారట .
విడాకులు తీసుకోవాలని అనుకున్నాక అవి వచ్చేవరకు కలిసి ఉండి తిట్టుకునే బదులు వేరు వేరుగా ఉంటె బాగుంటుందని గత ఏడాది కాలంగా వేరుగానే ఉన్నారట . ఇక ఇప్పుడు విడాకులు తీసుకున్నాం కాబట్టి మా ఇద్దరి ప్రేమకు గుర్తుగా కొడుకు పుట్టాడు కాబట్టి వాడి యోగ క్షేమాలు ఇద్దరం పంచుకోవాలని అనుకున్నాం . విడాకులు తీసుకున్నప్పటికీ మేము ఇద్దరం కూడా స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నామని అంటున్నాడు విష్ణు విశాల్ .
English Title: Actor Vishnu vishal clarify his divorce
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2qL9LWw
No comments :
Post a Comment