Thursday, November 15, 2018
సౌందర్య రెండో పెళ్లి చేసుకునేది ఇతడినేనంట
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు రెండో పెళ్లి కి సిద్ధమైంది అన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి . రజనీ రెండో కూతురు సౌందర్య ఇంతకుముందు అశ్విన్ అనే వ్యక్తి ని 2010 లో పెళ్లి చేసుకుంది , వాళ్లకు ఒక బాబు కూడా . బాబు పుట్టిన వెంటనే ఇద్దరూ విడిపోయారు . అశ్విన్ నుండి విడాకులు తీసుకుంది సౌందర్య . ఈ ఇద్దరినీ కలపడానికి రజనీకాంత్ ఎన్నో ప్రయత్నాలు చేసాడు కానీ కుదరలేదు దాంతో విడిపోయారు . కట్ చేస్తే ఇపుడు విసాఖన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది . సౌందర్య కు ఇది రెండో పెళ్లి కాగా వైశాఖన్ కు కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం .
వైశాఖన్ కుటుంబం వ్యాపారస్తుల కుటుంబం అలాగే వైశాఖన్ కు యాక్టింగ్ అంటే ఆసక్తి దాంతో చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తున్నాడు . సౌందర్య కు డైరెక్టర్ గా సక్సెస్ కొట్టాలని ఆశ కానీ చేసిన రెండు చిత్రాలు కూడా ఘోర పరాజయం పొందాయి . ఒకటి కొచ్చాడైయాన్ కాగా రెండోది వి ఐ పి 2 . రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి . కట్ చేస్తే ఈ ఇద్దరికీ కుదరడంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు . ఇటీవలే వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందట , వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నారట . ఇక ఇతడే సౌందర్య ని చేసుకునే వాడు అంటూ , రజనీకాంత్ చిన్నల్లుడు అంటూ ఓ ఫోటో వైరల్ అవుతోంది , అది ఇదే .
English Title: soundarya second marriage news goes viral
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2FmTz8c
No comments :
Post a Comment