Wednesday, November 28, 2018
పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేస్తానంటున్న కేఏ పాల్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీఎం కావాలని ఆశ ఉంటే అతడ్ని నేను సీఎం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు వివాదాస్పద శాంతి దూత డాక్టర్ కే ఏ పాల్ . ప్రజాశాంతి అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన పాల్ ఆ పార్టీ తరుపున అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టలేక చతికిల బడ్డాడు కానీ అమెరికా అధ్యక్షుడి ని చేసింది నేనే , ఒక్క అమెరికా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా పలువురిని దేశాధ్యక్షులు గా చేసింది నేనే అంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటాడు ఈ పాల్ . స్వతహాగా కాపు కులానికి చెందిన వాడైనప్పటికీ దళిత మహిళను పెళ్లి చేసుకున్నాడు కే ఏ పాల్ . అలాగే క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి విదేశాలు అయితే చుట్టొస్తున్నాడు .
తాజాగా ఓ ఛానల్ లో చర్చల్లో పాల్గొన్న కె ఏ పాల్ పవన్ కళ్యాణ్ నా తమ్ముడి లాంటి వాడని అతడ్ని ఆంధ్రప్రదేశ్ కు సీఎం ని చేస్తానని , అయితే అతడు నా ప్రజా శాంతి పార్టీలో చేరాలని అంటున్నాడు . అంతేనా పవన్ ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెడితే నేను ప్రపంచ దేశాలు చుట్టొచ్చి లక్ష కోట్లు తీసుకొస్తానని అంటున్నాడు . ఇక పవన్ కళ్యాణ్ కూడా కె ఏ పాల్ కు ఏమి తీసిపోవడం లేదు . 2019 లో నేనే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసుకుంటున్నాడు . అసలు జనసేన పార్టీ కి ఒక్క కమిటీ కూడా లేదు కేవలం ఉన్నది పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే ! 2009 లో ప్రజారాజ్యం ని స్థాపించి ఇతర పార్టీలలోని నాయకులను కార్యకర్తలను కలుపుకొని ప్రచారం చేస్తేనే 18 సీట్లు రాలేదు . కేవలం జనసేన పార్టీ ని మాత్రమే పెట్టేసి ఇక నేనే సీఎం అని ఎలా భ్రమలో ఉన్నాడో ! ఏంటో ! 2019 మేలో పవన్ భవితవ్యం తేలిపోనుంది .
English Title: KA Paul bumper offer gives to Pawan Kalyan
from టాప్ స్టోరీస్ – Telugu Movie Reviews | Telugu Cinema Reviews https://ift.tt/2rawsDM
No comments :
Post a Comment